మీరాకు టోక్యో బెర్త్‌

ABN , First Publish Date - 2021-06-13T09:32:51+05:30 IST

భారత స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు అధికారికంగా టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయమైంది. ఆమె 49 కిలోల విభాగంలో విశ్వక్రీడలకు అర్హత సాధించిందని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య...

మీరాకు టోక్యో బెర్త్‌

  • ఐడబ్ల్యూఎఫ్‌ అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ: భారత స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు అధికారికంగా టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయమైంది. ఆమె 49 కిలోల విభాగంలో విశ్వక్రీడలకు అర్హత సాధించిందని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) శనివారం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి చాను ఈ ఏడాది ఏప్రిల్‌లో తాష్కెంట్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకం నెగ్గడంతోనే టోక్యోకు అర్హత సాధించింది. కానీ, దీనిపై అప్పట్లో ఐడబ్ల్యూఎఫ్‌ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా తన విభాగంలో చాను వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలవడంతో, ఆమెకు టోక్యో ఎంట్రీ ఖరారైనట్టు అంతర్జాతీయ సమాఖ్య వెల్లడించింది. అంతకుముందు చాను నాలుగో ర్యాంకులో ఉండగా.. తాజాగా రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. 


Updated Date - 2021-06-13T09:32:51+05:30 IST