పాలకుర్తి: తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలోనే కేంద్రమే కొనుగోలు చేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి ల సన్నాహక సమావేశం భారీ బహిరంగ సభ స్థాయిలో పాలకుర్తి లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉల్టా పల్టా గా మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు మీరేం చేశారు? అని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కు ముందు తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఈ మార్పులు ఏంటి? అని విశ్లేషించుకోవాలి. 40 ఏండ్ల రాజకీయంలో నేను కెసిఆర్ లాంటి సీఎం ని చూడలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ గ్రామం, తండా కు పోయినా నీళ్ళ బాధలే. కానీ ప్రస్తుతం ఇంటింటికీ నల్లా లతో శుద్ధి చేసిన మంచినీళ్ళు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏమి చేశారు? అని సూటిగా బీజేపీ, కాంగ్రెస్ లను ప్రశ్నించారు.
తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచింది. నేను నా శాఖ ను సమర్ధత వంతంగా నిర్వహిస్తున్నానని అన్నారు. 57 ఏండ్ల కే ఇస్తున్న పెన్షన్లు ఒక్క పాలకుర్తి నియోజకవర్గం లోనే 16 వేల మందికి కొత్తగా రానున్నాయని చెప్పారు.త్వరలోనే ఉద్యోగాల కోసం తొర్రూరు, పాలకుర్తి లలో కోచింగ్ సెంటర్లు 90రోజులపాటు పెడతానని ప్రకటించారు. ఉచితంగా భోజన, వసతి, మెటీరియల్ ఇస్తాను. కనీసం వెయ్యి మందిని ఉద్యోగాల్లో చూడాలని అన్నారు.కేంద్రం వరి సాగు చేయవద్దన్నది. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వేసుకోవాలని చెప్పారు. ఇవ్వాళ వరి సాగు చాలా వరకు తగ్గింది. ఇప్పుడు కేంద్రం ధాన్యం కొనను అంది. రా రైస్ కొoటామని చెప్పింది. మళ్ళీ కొనబోమని అంది. ఇదంతా ఎందుకు పంజాబ్ తరహా లో వడ్లు కొనాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ వైఖరి దారుణంగా ఉందని. తెలంగాణ పట్ల బీజేపీ ఘోరంగా వ్యవహరిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.
ఇవి కూడా చదవండి