Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెదడు చురుకుదనానికి పుదీనా..

ఆంధ్రజ్యోతి(21-05-2021)

ప్రశ్న: వేసవిలో పుదీనా వినియోగించడం ద్వారా కలిగే లాభాల గురించి తెలియచేయండి. 


- లావణ్య, విశాఖపట్నం


డాక్టర్ సమాధానం: సాధారణంగా పుదీనాను అనేక రకాలుగా వినియోగిస్తాం. వండే ఆహార పదార్థాల్లోనే గాక టీలో, సలాడ్స్‌, మజ్జిగ, వివిధ రకాల జ్యూస్‌లలో కూడా పుదీనా వాడతాం. ఇది పదార్థాలకు చక్కని వాసనను, రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తక్కువ పరిమాణంలోనే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది పుదీనా. వేసవిలో పుదీనాను ఎక్కువగా వినియోగించడం మంచిది. గుప్పెడు పుదీనా ఆకుల్లో రోజుకు కావలసిన విటమిన్‌ - ఎ లో పది శాతం లభిస్తుంది. అజీర్తి, గ్యాస్‌ సమస్యలను ఎదుర్కోవడానికి పుదీనా బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా పుదీనా వేసి, కాచిన నీళ్లు తీసుకుంటే అది మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తరచూ పుదీనా ఆకులు నమలడం వల్ల నోటి దుర్వాసనను కూడా దూరం చేసుకోవచ్చు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement