ఇంట్లోనే మూలికలు!

ABN , First Publish Date - 2021-10-28T05:30:00+05:30 IST

లాంటి మొక్కలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని పెంచాలన్నా పెద్ద కష్టమేమీ కాదు. ఇంటి బాల్కనీలో లేదా కిటికీల దగ్గర కూడా పెంచుకోవచ్చు. ఔషధ గుణాలుండే ..

ఇంట్లోనే మూలికలు!

పుదీనా, తులసి, వాము, లెమన్‌గ్రాస్‌... 

లాంటి మొక్కలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని పెంచాలన్నా పెద్ద కష్టమేమీ కాదు. ఇంటి బాల్కనీలో లేదా కిటికీల దగ్గర కూడా పెంచుకోవచ్చు. ఔషధ గుణాలుండే ఈ మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయంటే.. సహజసిద్ధమైన ఫార్మసీని అభివృద్ధి చేసుకున్నట్లే!




పుదీనా : ఈ సారి ఇంటికి పుదీన కట్టల్ని తీసుకొచ్చినప్పుడు.. వాటి గట్టి కాడల్ని విసిరేయకుండా మట్టి కుండీల్లో నాటండి. సూర్యకిరణాలు ప్రసరించే చోటులో కుండీని ఉంచాలి. త్వరగా పుదీనా మొక్కలు పెరుగుతాయి. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌ ఉంటుంది. పుదీనాను ఆహారంలో తీసుకుంటే నోటి ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. 



వాము: సులువుగా వీటి ఆకుల్ని తుంచవచ్చు. మంచి వాసన వెదజల్లే ఈ ఆకుల్ని నీటితో కడిగి అలాగే తినేయచ్చు. టోస్ట్‌ లేదా క్రష్‌ చేసి కూడా వీటిని తినొచ్చు. వాము ఆకులకు తోడు ఉప్పు లేదా తేనె కలిపి తీసుకంటే.. దగ్గు, జలుబు, జ్వరంనుంచి ఉపశమనం కలుగుతుంది. వాము ఆకులు డైరక్ట్‌గా తినలేని వాళ్లు చట్నీ లేదా బజ్జీలు వేసుకుని కూడా తినొచ్చు. 



తులసి: మనదేశంలో ఎక్కువ శాతం ఇంటి దగ్గరే దొరికే మొక్క ఇది. వీటిలో ఔషధ గుణాలు అమోఘం. నీళ్లలో తులసి ఆకులను రోజంతా ఉంచి తాగడం మంచిది. దగ్గు, జలుబుని పోగొడుతుంది. గొంతులో ఇబ్బందిగా ఉంటే తులసి రసం తాగడం మంచిది. తులసి ఆకులతో చేసే హెర్బల్‌ టీ ఎంతో ఉపశమనం ఇస్తుంది. 



లెమన్‌ గ్రాస్‌ : కుండీల్లో వేగంగా పెరిగే మొక్కలు ఇవి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రక్తంలోని ఎర్ర రక్తకణాల్ని పెంచుతాయి. ఒత్తిడి, యాంగ్జయిటీని నియంత్రించే గుణం ఈ మొక్కకు ఉంది.

Updated Date - 2021-10-28T05:30:00+05:30 IST