రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో మంత్రి హరీష్ ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-03-02T13:23:45+05:30 IST

జిల్లాలోని న్యాల్కల్ మండలం రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో నిర్వహించిన అంగారక సంకట చతుర్థి వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు.

రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో మంత్రి హరీష్ ప్రత్యేక పూజలు

సంగారెడ్డి: జిల్లాలోని న్యాల్కల్ మండలం రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో నిర్వహించిన అంగారక సంకట చతుర్థి వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మంత్రి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రేజింతల్ సిద్ది వినాయక ఆలయ అభివృద్ధి కోసం ప్రకటించిన రెండు కోట్ల నిధులు ఈ బడ్జెట్‌లో  కేటాయిస్తామని తెలిపారు. సిద్ది వినాయక అలయంతో పాటు అన్ని దేవాలయలకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్టంలో దేవాలయాలకు కేటాయించిన నిధులు దారి మళ్లించారని విమర్శించారు. తెలంగాణలో దేవాలయలకు కేటాయించిన నిధులు వాటి అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి హరీష్‌రావుతో పాటు ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్‌పర్సన్ మంజు శ్రీ, ఎమ్మెల్యే మానిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T13:23:45+05:30 IST