పింఛా ప్రాజెక్టును పరిశీలించిన మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ

ABN , First Publish Date - 2020-11-29T05:27:02+05:30 IST

నివర్‌ తుఫాన కారణంగా కట్టతెగిపోయిన పింఛా ప్రాజెక్టును శనివారం మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ పుల్లారావుతో పాటు డిప్యూటీ సీఈ శివప్రసాద్‌రెడ్డి పరిశీలించారు.

పింఛా ప్రాజెక్టును పరిశీలించిన మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ
పింఛా కట్ట తెగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఈ పుల్లారావు

అన్నమయ్యను 10 టీఎంసీలు, పింఛాను 2 టీఎంసీలకు పెంచండి

సీఎంకు రాజంపేట ఎమ్మెల్యే వినతి

సుండుపల్లె/రాజంపేట, నవంబరు28: నివర్‌ తుఫాన కారణంగా కట్టతెగిపోయిన పింఛా ప్రాజెక్టును శనివారం మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ పుల్లారావుతో పాటు డిప్యూటీ సీఈ శివప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాథమిక తనిఖీ కోసం వచ్చామన్నారు. పింఛా ప్రాజెక్టు కట్ట తెగిన ప్రాంతంలో రింగు బండ వేసి మరమ్మతులు చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. వరద తాకిడికి ప్రాజెక్టు కట్టపైకి వచ్చిన చెట్లను, మొద్దులను, వరదనీరు పొర్లడం వల్ల దెబ్బతిన్న ప్రాజెక్టు కట్టను పరిశీలించారు. వరద ఉధృతి వివరాలను జిల్లా నీటి పారుదలశాఖ ఎస్‌ఈ రాముడు, ఈఈ వెంకట్రామయ్య సీఈకి వివరించారు. కాగా శనివారం తిరుపతి విమానాశ్రయంలో సీఎం వైఎస్‌ జగనను రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కలిశారు. పింఛా ప్రాజెక్టును 2.0 టీయంసీలకు, అన్నమయ్య ప్రాజెక్టును 10 టీఎంసీలకు పెంచి ఆ ప్రాంత రైతులను ఆదుకోవాలని సీఎంకు విన్నవించారు.

Updated Date - 2020-11-29T05:27:02+05:30 IST