బలరాంపూర్ (చత్తీస్‌ఘడ్): అత్యాచారానికి గురైన మైనర్ బాలిక విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. బసంత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక అత్యాచారానికి గురైంది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. దీంతో ఆవేదన చెందిన మైనర్ బాలిక విషం తాగింది. విషం తాగిన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు. కాగా బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించామని బలరాంపూర్ ఏఎస్పీ ప్రశాంత్ చెప్పారు. బాలిక ఆసుపత్రిలో కోలుకుంటుందని ఈ కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు.