మార్కెట్‌కు వెళ్లిన తల్లి.. ఇంట్లో తండ్రి నిద్రపోతున్న సమయం చూసి ఆ 16 ఏళ్ల కూతురి నిర్వాకమిది.. ఆ తండ్రి నిద్రలేచి చూస్తే..

ABN , First Publish Date - 2022-06-29T22:37:28+05:30 IST

ఆ బాలిక తండ్రి నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయాడు.. తల్లి కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లింది..

మార్కెట్‌కు వెళ్లిన తల్లి.. ఇంట్లో తండ్రి నిద్రపోతున్న సమయం చూసి ఆ 16 ఏళ్ల కూతురి నిర్వాకమిది.. ఆ తండ్రి నిద్రలేచి చూస్తే..

ఆ బాలిక తండ్రి నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయాడు.. తల్లి కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లింది.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ 16 ఏళ్ల బాలిక ఇంట్లో ఉన్న బంగారు నగలు, 48 వేల రూపాయలు, తన డాక్యుమెంట్లు తీసుకుని పరారైంది.. నిద్ర లేచిన తండ్రి.. కూతురి కోసం ఎంతగానో వెతికాడు.. ఇంట్లో డబ్బు, బంగారం కూడా కనిపించకుండా పోవడంతో అనుమానం మొదలై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 


ఇది కూడా చదవండి..

ఇద్దరికీ 16 ఏళ్ల వయసు.. అర్ధరాత్రి ఊరి చివరకు.. ఫొటోలు తీసుకుని.. వీడియోను చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్.. తెల్లారేలోపు..


రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలోని సోమల్‌పూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక ఆరో తరగతి చదువుతోంది. ఈ నెల 27 మధ్యాహ్నం ఒంటిగంటకు ఆ బాలిక తండ్రి నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయాడు. అతని భార్య మార్కెట్‌కి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఆ 16 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఆ బాలిక ఆచూకీ దొరకలేదు. ఇంట్లోని బీరువాలో చూసుకుంటే బంగారు నగలు, 48 వేల రూపాయలు కనిపించుకుండా పోయాయి. 


ఆ బాలిక తనకు సంబంధించిన ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్లిపోయింది. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-06-29T22:37:28+05:30 IST