పెళ్లి చేసుకుందామా..? అని అడిగిన ప్రియుడు.. నేనింకా మైనర్‌నే అని నో చెప్పిన 16 ఏళ్ల బాలిక.. తర్వాతే ఊహించని ఘోరం

ABN , First Publish Date - 2021-12-17T21:25:28+05:30 IST

ఆ బాలిక వయసు పదహారేళ్లు. పదో తరగతి చదువుతున్న ఆమెకు అదే గ్రామానికి చెందిన యువకుడితో

పెళ్లి చేసుకుందామా..? అని అడిగిన ప్రియుడు.. నేనింకా మైనర్‌నే అని నో చెప్పిన 16 ఏళ్ల బాలిక.. తర్వాతే ఊహించని ఘోరం

లక్నో: ఆ బాలిక వయసు పదహారేళ్లు. పదో తరగతి చదువుతున్న ఆమెకు అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే కొద్ది రోజుల తర్వాత ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఓ రోజు ప్రియుడు ఆ బాలికను పెళ్లి చేసుకుందామా..? అని అడిగాడు. అపుడు ఆ బాలిక మైనర్‌ కావడంతో పెళ్లికి నో చెప్పింది. ఆ తర్వాత ఊహించని ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


నాగల్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలికకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే కొద్దిరోజుల తర్వాత ప్రేమగా మారింది. వీలున్నపుడల్లా వారిద్దరు కలుసుకునేవారు. ఈ క్రమంలోనే నవంబర్ 23న ఆ బాలికను ప్రియుడు తన ఇంటికి రమ్మని పిలిచాడు. దీంతో ఆమె అక్కడికి వెళ్లింది. అపుడు ప్రియుడు పెళ్లి చేసుకుందామని బాలికకు ప్రపోజ్ చేశాడు. దానికి ఆమె తిరస్కరించింది. తన వయసు 16 ఏళ్లేనని, తానింకా మైనర్‌నని.. ఇపుడే పెళ్లి కుదరదని తేల్చి చెప్పింది. అదే సమయంలో ప్రియుడి స్నేహితుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. 


ఇద్దరు కలిసి ముందే చేసుకున్న ప్లాన్ ప్రకారం.. అతడు బర్గర్ తీసుకుని వచ్చి ఆమెకు ఇచ్చాడు. అది తిని ఇంటికి వెళ్లిపోమని ప్రియుడు చెప్పడంతో ఆమె బర్గర్ తినేసింది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని, అదే అదనుగా భావించి తనపై ప్రియుడు, అతడి స్నేహితుడు అత్యాచారం చేశారని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా నిందితుడు కొన్ని అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించాడని, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నట్లు బాలిక తెలిపింది. ఎస్పీ అతుల్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-12-17T21:25:28+05:30 IST