యూపీలో ఆగని అత్యాచారాలు.. మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-10-01T22:02:09+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార ఘటనలకు బ్రేక్ పడడంలేదు.

యూపీలో ఆగని అత్యాచారాలు.. మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం

యూపీ: ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార ఘటనలకు బ్రేక్ పడడంలేదు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ ఘటన జరిగి గంటలు కూడా గడవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. బాగ్‌పత్‌లో ఓ మైనర్ బాలిక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సెప్టెంబర్ 27న బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామంటూ బాలికను బెదిరించడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడిందని, ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని  పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-10-01T22:02:09+05:30 IST