Chhattisgarh: బాలికపై సామూహిక అత్యాచారం.. పంచాయతీ పెద్దలు ఇచ్చిన తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-13T01:37:37+05:30 IST

ఎన్ని చట్టాలు తీసుకువచ్చి కఠిన శిక్షలు విధిస్తున్నా దేశంలో మహిళలు, మైనర్లపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు.

Chhattisgarh: బాలికపై సామూహిక అత్యాచారం.. పంచాయతీ పెద్దలు ఇచ్చిన తీర్పు ఏంటంటే..

ఎన్ని చట్టాలు తీసుకువచ్చి కఠిన శిక్షలు విధిస్తున్నా దేశంలో మహిళలు, మైనర్లపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ మైనర్‌ బాలిక (16)పై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే.. పంచాయతీ నిర్వహించిన పెద్దలు బాధిత కుటుంబానికి రూ.లక్ష చెల్లించాలని చెప్పి నిందితులను వదిలేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. 


ఇది కూడా చదవండి..

మైనర్ బాలుడితో మహిళ Affair.. రాత్రి సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో..


ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన తండ్రితో కలిసి ఈ నెల 9వ తేదీన ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో అదే గ్రామానికి  చెందిన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. తండ్రిని కొట్టి బాలికను సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ఇద్దరితో కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి గ్రామ పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. 


జరిగిన ఘటనపై గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. నష్ట పరిహారం కింద బాధిత కుటుంబానికి నిందితులు రూ.లక్ష ఇవ్వాలని తీర్మానించారు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బాధిత కుటుంబ సభ్యులను ఆదేశించారు. అయితే జరిగిన ఘటన గురించి పోలీసులకు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-07-13T01:37:37+05:30 IST