నా మనవరాలిని చెప్పలేని విధంగా లైంగికంగా వేధించాడు: మాణిక్యాలరావు

ABN , First Publish Date - 2022-01-30T22:13:47+05:30 IST

విజయవాడలో ఆకతాయి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

నా మనవరాలిని చెప్పలేని విధంగా లైంగికంగా వేధించాడు: మాణిక్యాలరావు

విజయవాడ: విజయవాడలో ఆకతాయి వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఆత్మహత్యపై బాలిక, తాతయ్య మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడుతూ తన మనవరాలు శనివారం మధ్యాహ్నం నుంచి మూడీగా ఉందని తెలిపారు. ‘‘నిన్న నా మనవరాల్ని ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎలాంటి సమాధానం చెప్పలేదు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో నేను మా కుమార్తె.. వాకింగ్‌కి వెళ్తున్న సమయంలో పలకరించింది. ఒకసారి వాళ్ళ అమ్మ దగ్గరకు.. వచ్చి ఐ లవ్ యూ మమ్మీ.. ఐ లవ్ యూ మమ్మీ అంటూ.. రెండుసార్లు మాట్లాడి తల్లిని కౌగిలించుకుంది. అపార్ట్‌మెంట్ వాసులు ఎవరో చిన్నారి.. సూసైడ్ చేసుకుందని చెబితే అక్కడికి వెళ్లి చూశాం. ఘటనా స్థలానికి వచ్చి పోలీసులు మా మనవరాలు బెడ్ రూమ్‌కి వెళ్లారు. బెడ్ రూమ్‌లో సూసైడ్ నోట్ రాసి ఉంది. అందులో మేము మాట్లాడలేని విధంగా వినోద్ జైన్, నా మనవరాలిని చెప్పలేని విధంగా లైంగికంగా వేధించాడు’’ అని మాణిక్యాలరావు తెలిపారు.

Updated Date - 2022-01-30T22:13:47+05:30 IST