దొంగతనం చేసిన మైనర్.. బామ్మను అరెస్టు చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2020-08-04T22:47:37+05:30 IST

అతడో పన్నేండేళ్ల పసివాడు. స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన వయసది. కానీ..అతడి తల్లికి, బామ్మకు మాత్రం ఇవేమీ పట్టలేదు. అందుకే వారు స్వలాభం కోసం అతడిని దొంగతనం చేసేందుకు ఉసిగొల్పారు.

దొంగతనం చేసిన మైనర్.. బామ్మను అరెస్టు చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: అతడో పన్నేండేళ్ల పసివాడు. స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన వయసది. కానీ..అతడి తల్లికి, బామ్మకు మాత్రం ఇవేమీ పట్టలేదు. అందుకే వారు స్వలాభం కోసం ఆ చిన్నారిని దొంగతనానికి ఉసిగొల్పారు. అతడు ఏకంగా రూ. 1.2 లక్షల రూపాయలు తస్కరించేలా చేశారు. ఢిల్లీలోని అంబేడ్కర్ నగర్‌లో మంగళవారం ఈ దారుణం జరిగింది. తల్లి, బామ్మల ప్రోత్సాహంతో ఆ చిన్నారి పార్క్ చేసి ఉన్న వాహనం లోంచి రూ. 1.2 లక్షలను దొంగిలించాడు. బాధితుల పిర్యాదు మేరుకు రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ మైనర్ ఈ దొంగతనానికి పాల్పడ్డాని గుర్తించారు. ఆ తరువాత.. అతడి ఆచూకీ గురించి పోలీసులకు ఉప్పందడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మైనర్ నుంచి రూ. 5 వేలు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. విచారణ సందర్భంగా అతడు..జరిగిన విషయాలన్నీ పోలీసులకు చెప్పాడు. తన తల్లీ, బామ్మ సూచనల మేరకే ఈ దొంగతనానికి పాల్పడ్డానని పోలీసుల ముందు అంగీకరించాడు. అతడిచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని ఆమె నుంచి రూ. 1.05 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడి తల్లి ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారు ఆమె కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 

Updated Date - 2020-08-04T22:47:37+05:30 IST