Kuwait: అక్కడ ఏదైతే చేయకూడదో.. అదే చేసి సమస్యలు కొని తెచ్చుకున్నాడు!

ABN , First Publish Date - 2022-08-01T20:54:56+05:30 IST

చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల జాబితాలో కువైత్ కూడా ఒకటి. అయితే ఈ చట్టాలపై సరైన అవగాహన లేకుండా చాలా మంది సమస్యలు కొని తెచ్చుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా సమస్యలో ఇరుక్కున్నాడు. అత

Kuwait: అక్కడ ఏదైతే చేయకూడదో.. అదే చేసి సమస్యలు కొని తెచ్చుకున్నాడు!

ఎన్నారై డెస్క్: చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల జాబితాలో కువైత్ కూడా ఒకటి. అయితే ఈ చట్టాలపై సరైన అవగాహన లేకుండా చాలా మంది సమస్యలు కొని తెచ్చుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా సమస్యలో ఇరుక్కున్నాడు. అతడు చేసిన అతే అందుకు కారణం. కాగా.. ఇంతకూ కువైత్‌లో ఆ వ్యక్తి ఏ చట్టాన్ని ఉల్లంఘించాడు. చివరికి అతడి పరిస్థితి ఏమైంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఇంటర్నెట్(Internet) అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది చేతుల్లోకి స్మార్టు ఫోన్‌లు(Smart Phones) వచ్చాయి. ఈ క్రమంలోనే సోషల్  మీడియా వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినట్టు గుర్తిస్తే.. ఆ రోడ్డున వెళ్లే తోటి ప్రయాణికులు ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి అధికారులను అలర్ట్ చేసే వారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది. అందరూ ఇలా చేస్తున్నారని చెప్పలేం కానీ చాలా మంది ప్రమాద దృశ్యాలను ముందుగా తన ఫోన్‌లో చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇవ్వాలనిపిస్తే అధికారులకు సమాచారం ఇస్తున్నారు. సరిగ్గా ఈ కోవకు చెందిన వ్యక్తే.. కువైత్‌(Kuwait) లో సమస్యల్లో ఇరుక్కున్నాడు. రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్(Accident), ప్రమాద స్థలంలో ఉన్న మృతదేహాల దృశ్యాలను చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అక్కడి చట్టాల ప్రకారం కువైత్‌లో నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడితే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. దీనిపై అవగాహన లేని వ్యక్తి.. కువైత్‌లోని థర్డ్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన యాక్సిడెంట్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశాడు. అదికాస్తా అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సీరియస్ అయిన అధికారులు.. అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ విషయం ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ అయింది. కాగా.. సదరు వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.


Updated Date - 2022-08-01T20:54:56+05:30 IST