ఆ విషయంలో 40వేల మంది వలసదారులకు షాకిచ్చేందుకు రెడీ అవుతున్న Kuwait..!

ABN , First Publish Date - 2021-10-12T20:50:39+05:30 IST

వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ విషయం‌లో కఠినంగా వ్యవహరిస్తున్న కువైత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వేలాది మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లను క్యాన్సిల్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రొఫెషన్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సుమారు 40వేల మంది వలసదారులు ప్రొఫెషన్ మారిన...

ఆ విషయంలో 40వేల మంది వలసదారులకు షాకిచ్చేందుకు రెడీ అవుతున్న Kuwait..!

కువైత్ సిటీ: వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ విషయం‌లో కఠినంగా వ్యవహరిస్తున్న కువైత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వేలాది మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లను క్యాన్సిల్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రొఫెషన్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సుమారు 40వేల మంది వలసదారులు ప్రొఫెషన్ మారిన తర్వాత తిరిగి వాటిని ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇలా ప్రొఫెషన్ మారిన తర్వాత కూడా డ్రైవింగ్ లైసెన్సులను ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో వారు ఆటోమెటిక్ ఆ లైసెన్స్‌లను కోల్పోయినట్లేనని అధికారులు పేర్కొన్నారు. కొత్త ప్రొఫెషన్ ఆధారంగా పాత లైసెన్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ, చాలామంది అలా చేయలేదు. అంతేగాక వీటిలో చాలా మంది లైసెన్సులకు గడువు ముగిసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా గడువు ముగిసిన వాటితో పాటు ప్రొఫెషన్ మారిన వారి లైసెన్సులను రద్దు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 


ఇక దాదాపు 20వేల మంది యూనివర్శిటీ విద్యార్థులు వారి స్టూడెంట్ స్టేటస్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. వీరిలో చాలామంది చదువులు పూర్తి చేసుకున్న తిరిగి డ్రైవింగ్ లైసెన్స్‌లను అప్పగించలేదు. వాటిని అలాగే వినియోగిస్తున్నట్లు సంబంధిత అధికారులకు గుర్తించారు. వాటిని రెన్యువ్ చేయకుంటే బ్లాక్ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వశాఖ సంబంధిత డేటాను ట్రాఫిక్ విభాగం, మానవవనరుల, రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌కు లింక్ చేసి నేరుగా బ్లాక్ చేసే విధంగా ప్రణాళిక తయారు చేసింది. దీనివల్ల ప్రవాసులు ఎవరైతే పాత, చెల్లని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటారో వారు తమ రెసిడెన్సీ పర్మిట్లను కూడా పునరుద్ధరించడానికి అవకాశం ఉండదు. అప్పుడు తప్పకుండా వలసదారులు గడువు ముగిసిన డ్రైవింగ్ లెసెన్స్‌లను అధికారులకు అప్పగిస్తారని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలాఉంటే.. కొత్త మెకానిజం రెడీ అయ్యేవరకు వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీని నిలిపివేయాలని ఇటీవలే మంత్రిత్వశాఖ అండర్‌సెక్రెటరీ షేక్ ఫైజల్ అల్ నవాఫ్ సంబంధిత అధికారులకు సూచించారు. 


Updated Date - 2021-10-12T20:50:39+05:30 IST