సామాజిక భేరీ.. జనమేరీ..?

ABN , First Publish Date - 2022-05-28T07:22:16+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమై విశాఖ జిల్లా మీదుగా వైసీపీ సామాజిక న్యాయ భేరీ బస్సుయాత్ర శుక్రవారం తునిలో అడుగుపెట్టింది. తూర్పుగోదావరి జిల్లాకు ముఖద్వారమైన తునిలో యాత్రకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో మంత్రులు తుని నేలపై అడుపెట్టకుండానే యాత్రను కొనసాగించారు.

సామాజిక భేరీ..  జనమేరీ..?
తునిలో జనం లేకపోవడంతో బస్సులో నుంచే అభివాదం చేస్తున్న మంత్రి బొత్స

  • జనం లేక తునిలో దిగని మంత్రులు
  • వెలవెలబోయిన వైసీపీ బస్సు యాత్ర
  • జిల్లా ప్రారంభంలోనే వైసీపీకి ఎదురుదెబ్బ

తుని, మే 27: శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమై విశాఖ జిల్లా మీదుగా వైసీపీ సామాజిక న్యాయ భేరీ బస్సుయాత్ర శుక్రవారం తునిలో అడుగుపెట్టింది. తూర్పుగోదావరి జిల్లాకు ముఖద్వారమైన తునిలో యాత్రకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో మంత్రులు తుని నేలపై అడుపెట్టకుండానే యాత్రను కొనసాగించారు. 17మంది మంత్రులతో కూడిన ఏసీ బస్సు మధ్యాహ్నం 2.30 గంటలకు తుని చేరుకుంది. స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా అందుబాటులో లేకపోవడంతో ఎంపీ వంగా గీతా స్వాగతం పలికేందుకు తుని చేరుకున్నారు. అక్కడకు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌పెదపాటి అమ్మాజీతోపాటు కొద్దిమంది స్థానిక నేతలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు మాత్రమే హాజరయ్యారు. బస్సు వచ్చిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ బస్సు నుంచి డ్రైవర్‌ సీటు వరకూ వచ్చి స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలను పరిశీలించారు. అతితక్కువమంది మాత్రమే ఉండడంతో బస్సు నుంచి దిగకుండా మెట్లపై నిలబడ్డారు. అక్కడికే వెళ్లి ఎంపీ వంగా గీతా ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు. బొత్స కిందకు దిగకుండానే కార్యకర్తలకు చేయి ఊపి ప్రయాణం కొనసాగించారు. ఎంపీ గీత కూడా బస్సులో వారితోపాటు ప్రయాణమయ్యారు. పది నిమిషాల వ్యవధిలోనే కార్యక్రమం ముగిసింది.

ప్రారంభం కాకుండానే వెనుదిరిగిన మహిళలు

జగ్గంపేట, మే 27: జగ్గంపేటలో శుక్రవారం సామాజిక న్యాయభేరిలో భాగంగా మంత్రులు పర్యటించారు. సాయం త్రం 6గంటల సమయంలో బస్సులో 17మంది మంత్రులు జగ్గంపేట-కాకినాడ రోడ్డులో ఏర్పాటు చేసిన నాలుగు రోడ్ల జంక్షన్‌లో వేదికపైకి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు బస్సు యాత్రలో విచ్చేసిన మంత్రులకు స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కుర సాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని, కాకినాడ జిల్లాలోని తుని, ప్రత్తిపాడు మీదుగా జగ్గం పేట వచ్చామని తెలిపారు. అనంతరం మంత్రి విడుదల రజని మాట్లాడుతూ సామాజిక న్యాయభేరి అనగా జగనన్న ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు సంబంధించిన 17మందికి మంత్రి పదవులు కేటాయించారని, కొత్తగా తీసుకున్న 25 మంది మంత్రుల్లో 17మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వారే ఉన్నారని, సామాజిక న్యాయం అంటే ఇదేనని తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ సీఎం జగన్‌  అన్ని కులాలకు పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చేశారన్నారు.

వచ్చామా.. వెళ్లామా...

సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్రకు వచ్చిన మంత్రులకు స్వాగతం పలికేందుకు మధ్యాహ్నం 2గంటల నుంచే మహిళలు, యువకులు, కార్యకర్తలు జగ్గంపేట నియో జకవర్గంలోని గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి, జగ్గంపేట మండలాలనుంచి అధికసంఖ్యలో వచ్చారు. అనుకున్న సమ యానికి మంత్రులు రాకపోవడంలో 4 గంటల నుంచే పల్లె గ్రామాల నుంచి వచ్చిన మహిళలు, వృద్ధులు సభావేదిక నుంచి వెనక్కి తిరిగి వెళ్లారు. ఈ సభకు జనాన్ని తరలించ డానికి వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మండల సిబ్బంది, సంక్షేమ కుటుంబాలు ఇచ్చే వారి కుటుంబాలపై ముందస్తు గానే శుక్రవారం జరిగే జగ్గంపేట సభకు సంక్షేమ పథకాలు అందుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కుటుంబాలకు ముంద స్తు సమాచారం ఇచ్చారు. దీంతో వారందరినీ సభకు తర లించడంలో ఉద్యోగులే తమపై భారం పెట్టుకోవడంతో పలు గ్రామాలనుంచి భారీగా తరలివచ్చారు. మంత్రు లు సమయానికి రాకపోవడంతో అధి కారులు సమకూర్చిన వాహనాలు వదిలివేసి స్వచ్ఛందం గా మహిళలు, వృద్ధులు ఇతర వాహనాలపై తరలివెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే సభకు వచ్చిన వారందరికీ మజ్జిగ, మంచి నీరు, టి.అల్పాహారం అందించారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, సీఐ సూర్యఅప్పారావు, ఎస్‌ఐ రఘునాధబాబు ఈ యాత్రను పర్యవేక్షిం చారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా ముందస్తుగా ప్రణాళిక చేయడంతో ప్రజలు ఇబ్బంది పడలేదు. 

Updated Date - 2022-05-28T07:22:16+05:30 IST