మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం

ABN , First Publish Date - 2022-03-17T00:33:56+05:30 IST

మతసామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకంగా నిలుస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్అలీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం

హైదరాబాద్: మతసామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకంగా నిలుస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్అలీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ లౌకిర రాష్ట్రమని, ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకిక వాదిగా పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమయ్యే రంజాన్ మాసం నేపధ్యంలో బుధవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీన్ ఉల్ జాఫ్రీ, సయ్యద్ రియాజ్ ఉల్ హసన్, ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, మౌజంఖాన్, అహ్మద్ బిన్ బలాల, అహ్మద్ పాషా ఖాద్రీ,జాఫర్ హుస్సేన్ మీరాజ్,ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్,డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్,పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఐపిఎస్ అధికారి చౌహాన్, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అన్ని కులాలు,మతాలను సమదృష్టితో చూస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని ప్రధాన పండుగలు,జాతరలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. రంజాన్ పవిత్ర మాసం, పండగకు పేదలకు దుస్తుల పంపిణీ,ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చే విందును,పండుగను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు శ్రద్ధతో పనిచేయాలని అన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


మసీదులు,ఈద్గాలకు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని,సున్నాలు వేయాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు పూర్తి చేయాలని, నీళ్లు, విద్యుత్ సరఫరాలకు ఎటువంటి కొరత రాకుండా చేసుకోవాలి,అవసరమైన పాలు, చక్కర,బియ్యం, వంట గ్యాస్,ఇతర నిత్యావసరాలు అందుబాటులో ఉండాలన్నారు. వీధి దీపాలన్నీ కూడా వెలిగే విధంగా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి విందు రోజు పండుగ నాడు మోబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, పేదలకు పంపిణీ చేసే దుస్తులను పండుగకు చాలా ముందేగానే అందజేయాలన్నారు. రాత్రి వేళల్లో తెరచి ఉన్న హోటళ్లు,షాపులను బంద్ పెట్టమని వత్తిడి చేయొద్దని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-03-17T00:33:56+05:30 IST