మహాధర్నాలో మంత్రుల హడావిడి

ABN , First Publish Date - 2022-04-11T20:19:22+05:30 IST

తెలంగాణ వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలని, దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహాధర్నా నిర్వహించారు.

మహాధర్నాలో మంత్రుల హడావిడి

న్యూఢిల్లీ: తెలంగాణ వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలని, దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో  మహాధర్నా నిర్వహించారు. నిరసన దీక్షలో కేసీఆర్ తో పాటు పెద్దసంఖ్యలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు హడావిడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేశవరావు, కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు మంత్రులు పెద్ద సంఖ్యలో నాయకులను, ముఖ్యనేతలను తెలంగాణ నుంచి తరలించారు. కేంద్రం తీరును ఎండగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా మంత్రులు సైతం తమ ప్రసంగాల్లో కేంద్రంపై విమర్శలు చేశారు. 

Updated Date - 2022-04-11T20:19:22+05:30 IST