ధాన్యం కొనుగోలులో సమన్వయంతో సాగాలి

ABN , First Publish Date - 2020-04-10T06:27:51+05:30 IST

ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌, గిడ్డంగుల కార్పొరేషన్లు సమన్వయంతో సాగాలని మంత్రులు...

ధాన్యం కొనుగోలులో సమన్వయంతో సాగాలి

అధికారులకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌ ఆదేశం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంద్రజ్యోతి): ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌, గిడ్డంగుల కార్పొరేషన్లు సమన్వయంతో సాగాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పురోగతిపై పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు నాగేందర్‌తోపాటు వివిధ శాఖల అధికారులతో మంత్రులు గురువారం సమీక్షించారు. రాష్ట్రంలో 713 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని,  కామారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో ధాన్యం సేకరణ ఇప్పటికే  ప్రారంభమైందని తెలిపారు. 

Updated Date - 2020-04-10T06:27:51+05:30 IST