కాళేశ్వరం జలాలతో సూర్యాపేట సస్యశ్యామలం: మంత్రి జగదీష్ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-01T20:22:35+05:30 IST

కాళేశ్వరం జలాలతో మూడేళ్ళుగా సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమైందని

కాళేశ్వరం జలాలతో సూర్యాపేట సస్యశ్యామలం: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: కాళేశ్వరం జలాలతో మూడేళ్ళుగా సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమైందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా స్వామి వారిని మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి జగదీష్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమ పొలాలు పచ్చగా మారడంతో రైతుల సంతోషం లింగమంతుల స్వామి జాతరలో కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.


యాదవ సోదరులపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని ఆయన అన్నారు. ఆ ప్రేమతోనే ఈ జాతరకు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేశారని మంత్రి తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల కోసం 24 గంటల నిరంతర తాగు నీరు, విద్యుత్ సరఫరానును ఏర్పాటు చేసామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 







పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర  వైభవంగా సాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెద్దగట్టును సీఎం కేసీఆర్ చాలా అభివృద్ధి చేశారని తలసాని పేర్కొన్నారు. రాష్ట్రన్నీ మరింత సుభిక్షంగా చేయాలని యాదవుల ఇలవేల్పు లింగమంతుల స్వామిని కోరుకున్నానని తలసాని తెలిపారు. తెలంగాణ దేవాలయాలకు సీఎం కేసీఆర్ పునర్ వైభవం తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-01T20:22:35+05:30 IST