కియా శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు

ABN , First Publish Date - 2020-08-07T04:18:56+05:30 IST

కియా శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు

కియా శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు

అనంతపురం: కియా శిక్షణ కేంద్రాన్ని వైసీపీ మంత్రులు పరిశీలించారు. పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద ఉన్న కియా పరిశ్రమ కియా శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రోడ్డు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఏపీ ఎస్ డీసీ ఎండీ ఆర్జా శ్రీకాంత్ పరిశీలించారు. కియా ఫ్యాక్టరీ పురోగతికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు కియా ఎండీ వివరించారు. శిక్షణా కేంద్రంలోని కంప్యూటర్ ల్యాబ్ , లెక్చరర్ రూములు, అసెంబుల్ షాపు, ఇంజిన్, పెయింట్, ప్రెస్, బాడీ షాప్ లను రోబోట్ ల్యాబ్, బేసిక్ టెక్నికల్, మెయింటినెన్స్ షిప్ ల ద్వారా శిక్షణ అందించే విధానాన్ని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు కియా అధికారులు వివరించారు.


రాష్ట్రంలోని వివిధ జిల్లాల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబోయే నైపుణ్య శిక్షణ కళాశాలలో రూపొందించాల్సిన సిలబస్ గురించి, వివిధ పరిశ్రమల్లో అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించి కామన్ సిలబస్ రూపొందించేందుకు సంబంధిత అధికారులతో కలిసి ఇక్కడికి రావడం జరిగిందని మంత్రి బుగ్గన అన్నారు. కియాలో కార్ల తయారీకి సంబంధించి నెల, మూడు కోర్సులను రూపొందించేందుకు గల అవకాశాలను పరిశీలించామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలకు అవసరమయ్యే శిక్షణకు సంబంధించిన అంశాలను సిలబస్ లో పొందుపరచి కామన్ సిలబస్ ను రూపొందించే ఆలోచనలో తాము ఉన్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.

Updated Date - 2020-08-07T04:18:56+05:30 IST