యోగా అంటే ఒక ఫిలాసఫీ: మంత్రి Vidala Rajani

ABN , First Publish Date - 2022-06-21T14:06:10+05:30 IST

యోగా అంటే ఒక ఫిలాసఫీ, పాజిటివ్ థింకింగ్‌ని అలవరుస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ అన్నారు.

యోగా అంటే ఒక ఫిలాసఫీ: మంత్రి Vidala Rajani

విజయవాడ: యోగా అంటే ఒక ఫిలాసఫీ, పాజిటివ్ థింకింగ్‌ని అలవరుస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ (Vidala Rajani) అన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ఆయుష్ శాఖ నిర్వహిస్తున్న యోగా క్యాంప్‌కు మంత్రి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ... చాలా మంది విదేశీయులు ఇండియాకు యోగా నేర్చుకోవడం కోసం వస్తుంటారని అన్నారు. భారత దేశం గొప్పతనం, మన జీవన శైలిని విదేశీయులు కీర్తిస్తూ ఉంటారని తెలిపారు. ఈ వత్తిడి జీవితంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా చెయాలని మంత్రి విడదల రజనీ తెలిపారు. 

Updated Date - 2022-06-21T14:06:10+05:30 IST