Abn logo
Sep 17 2020 @ 02:10AM

అర్థవంతంగా సమావేశాలు

సీఎం చొరవతోనే ప్రశ్నోత్తరాలు: మంత్రి వేముల


అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయని, అర్థవంతంగా సాగాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సభల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లామని చెప్పారు. ఇందుకు సహకరించిన అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌, సభా నాయకుడు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ, మండలి సమావేశాల్లో తీర్మానించడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంటు సహా పలు రాష్ట్రాల చట్ట సభల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసినప్పటికీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చొరవతో యఽథావిధిగా కొనసాగించామని, జీవో అవర్‌నూ నిర్వహించామని తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే సమావేశాలను కుదించాలని స్పీకర్‌, చైర్మన్‌ నిర్ణయించారని స్పష్టం చేశారు. 103 మంది సభ్యులున్న టీఆర్‌ఎ్‌సతో సమానంగా కాంగ్రెస్‌, మజ్లిస్‌ సభ్యులు మాట్లాడారని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement