చెక్‌డ్యాంల నిర్మాణంపై మంత్రి వేముల సమీక్ష

ABN , First Publish Date - 2020-06-07T10:24:04+05:30 IST

బాల్కొండ నియోజకవర్గంలో కప్పలవాగు, సిద్ధవాగుపై నూతనంగా మంజూరైన చెక్‌డ్యాంల నిర్మాణంపై జిల్లా ఇరిగేషన్‌ ...

చెక్‌డ్యాంల నిర్మాణంపై మంత్రి వేముల సమీక్ష

నిజామాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బాల్కొండ నియోజకవర్గంలో కప్పలవాగు, సిద్ధవాగుపై నూతనంగా మంజూరైన చెక్‌డ్యాంల నిర్మాణంపై జిల్లా ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వాగులకు పూర్వ వైభ వం తీసుకురావాలన్న తన కల ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సహకారంతో నెరవేరబోతుందన్నారు. పెద్దవాగు, కప్పలవాగులో ఏడాది పొడవునా నీరు ప్రవహించడం తన చిన్నతనంలో చూశానని, ప్రస్తుత కాలంలో ఒట్టిపోయి ఉన్న ఈ రెండు వాగులు అన్ని కాలాల్లో నీటితో నిండివుండాలన్న తన కల ఇప్పటికి నెరవేరనుందన్నారు. ప్రతీ వర్షపుబొట్టును ఒడిసి పట్టి సద్వినియోగం చేసే కార్యక్రమాలు చేపట్టిన సీఎం కేసీఆర్‌ సహకారంతో తొలివిడతగా మూడు చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా సత్ఫలితాలు కానరావడంతో విడతలవారీగా మరో ఆరు చెక్‌డ్యాంలు మంజూరు చేయించామన్నారు. అనంత రం రాష్ట్ర ప్రభుత్వం వాగులు, వంకల్లో చెక్‌డ్యాంలను విరివిగా నిర్మించే కార్యక్రమం చేపడుతో ందన్నారు.


దీంతో మరో పది చెక్‌డ్యాంలు మంజూరు చేయించామని, వీటిని రూ.60 కోట్లతో పూ ర్తిచేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. దీంతో కప్పలవాగు, పెద్దవాగుల్లో షేక్‌హ్యాండ్‌ చెక్‌డ్యాంల ఏర్పాటు జరుగుతుందని, ఇందులో భాగంగా 2.5 కిలో మీటర్లకు ఒకటి వంతున చింతలూరు-గాండ్లపేట మధ్య కొత్తపల్లి, కొలిప్యాక్‌, పచ్చలనడ్కుడ, వేల్పూర్‌, వెంకటాపూర్‌, సుంకెట్‌, కుకునూర్‌ వద్ద చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే కప్పలవాగుపై గోనుగొప్పుల-రామన్నపే ట మధ్య బెజ్జోర, ఆక్లూర్‌ ఎగువ, ఆక్లూర్‌ దిగువ, మోతె వద్ద నాలుగు చెక్‌డ్యాంలు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. పది అడుగుల ఎత్తులో నిర్మించే ఈ చెక్‌డ్యాంలలో మూడు కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 19 చెక్‌డ్యాంల నిర్మాణం జరుగుతుందని, మరో నాలుగు చెక్‌డ్యాంలు మంజూరైతే 23 చెక్‌డ్యాంలతో రెండు వాగులు జలకళతో ఉట్టిపడతాయన్నారు. 60 కిలోమీటర్ల  పొడవునా నియోజకవర్గంలో విస్తరించివున్న ఈ వాగుల దారా 33 గ్రామాల పరిధి 30 వేల ఎకరాలకు సంబంధించిన బోర్లలో నీరుచేరి సాగునీటి ప్రయోజనం కలగనుందన్నారు. నూతనంగా మంజూరైన చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించిన వివరాలను బోర్డుపై మ్యాప్‌ గీసి అధికారులకు వివరించారు. టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి పనులను తొందరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆత్మారాం, ఈఈ, డీఈ, నియోజకవర్గస్థాయి ఇరిగేషన్‌ జేఈలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T10:24:04+05:30 IST