కడప: కొన్ని రోజులుగా వివాదంలో నడుస్తున్న బ్రహ్మంగారి మఠంలో పీఠం వివాదంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చర్చిస్తున్నారు. బ్రహ్మంగారికి చెందిన రెండు వారసత్వ కుటుంబాల సభ్యులతో మంత్రి చర్చలు జరిపారు. పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామి, వెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులతో మంత్రి చర్చలు జరిపారు.