మంత్రి వెలంపల్లికి రాజధాని నిరసన సెగ

ABN , First Publish Date - 2021-07-25T05:28:17+05:30 IST

రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కి రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. శనివారం గురుపౌర్ణమి సందర్భంగా మంత్రి వెలంపల్లి రాజధానిలోని తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రంలో పూజలు నిర్వహించటానికి వచ్చారు.

మంత్రి వెలంపల్లికి రాజధాని నిరసన సెగ
మంత్రి వెలంపల్లి కారు వద్ద రాజధాని రైతులు, మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు

వినతిపత్రం ఇవ్వబోయిన రైతులను లాగేసిన పోలీసులు 

తుళ్లూరు, జూలై 24 : రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కి రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. శనివారం గురుపౌర్ణమి సందర్భంగా మంత్రి వెలంపల్లి రాజధానిలోని తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రంలో పూజలు నిర్వహించటానికి వచ్చారు. గంటన్నర సేపు  క్షేత్రం విశిష్టతలు తెలుసుకొని పూజలు నిర్వహించారు. మంత్రిని కలిసేందుకు రాజధాని మహిళలు,  రైతులు యత్నించారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. స్వామి వారి దర్శనం చేసుకొని బయటకు  వసుండగా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మంత్రికి రక్షణ వలయంగా నిలిచారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని పక్కకు లాగేసి, మంత్రిని వాహనంలోకి ఎక్కించారు. రాజధానిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి త్వరితగతిని చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చేందకు ప్రయత్నించగా పోలీసుల అండతో  కారెక్కి వెళ్లిపోరని రాజధాని రైతులు, దళిత జేఏసీ సభ్యులు విమర్శించారు. ఆలయ నిర్మాణానికి మొదట  ఇచ్చిన 25 ఎకరాలు యథాతథంగా ఉంచి ఆలయ అభివృద్ధిని త్వరరితగతిని పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేశారు. 

 

Updated Date - 2021-07-25T05:28:17+05:30 IST