రఘురామకు ఎంపీ పదవి జగన్ భిక్ష: మంత్రి వనిత

ABN , First Publish Date - 2021-05-15T20:31:04+05:30 IST

రఘురామకృష్ణంరాజుకు ఎంపీ పదవి ముఖ్యమంత్రి జగన్ పెట్టిన భిక్ష అని మంత్రి తానేటి వనిత అన్నారు. జగన్మోహన్ రెడ్డి దయతో, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదని ఆమె

రఘురామకు ఎంపీ పదవి జగన్ భిక్ష: మంత్రి వనిత

ఏలూరు: రఘురామకృష్ణంరాజుకు ఎంపీ పదవి ముఖ్యమంత్రి జగన్ పెట్టిన భిక్ష అని మంత్రి తానేటి వనిత అన్నారు. జగన్మోహన్ రెడ్డి దయతో, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. శనివారం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ సరైన భాష, వ్యవహరం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన సహజ లక్షణమని, అయితే రాఘురామకు అందులో ఒక్కటీ కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజా సంక్షేమం వదిలేసి ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. తెలుగుదేశం వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఎక్కడబడితే అక్కడ తన స్థాయిని మరచి ఎలాబడితే అలా మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌ను తామంతా సమర్థిస్తున్నట్లు మంత్రి వనిత అన్నారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, ఆయన్ను సమర్థిస్తున్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు.

Updated Date - 2021-05-15T20:31:04+05:30 IST