అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు

ABN , First Publish Date - 2020-11-29T06:29:16+05:30 IST

సభ్య సమాజం తలదించుకునే లా ఐదేళ్ల చిన్నారిపై అ త్యాచారానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్షప డేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత తె లిపారు. ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే ద్వా రంపూడి చంద్రశేఖరరెడ్డితో కలసి జీజీహెచ్‌లో గైనిక్‌వార్డులో చికిత్స పొందుతున్న బాధిత చి న్నారిని మంత్రి వనిత శనివారం పరామర్శించారు.

అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు
జీజీహెచ్‌లో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి తానేటి

  • బాధిత చిన్నారిని పరామర్శించిన మంత్రి వనిత

జీజీహెచ్‌ (కాకినాడ), నవంబరు 28: సభ్య సమాజం తలదించుకునే లా ఐదేళ్ల చిన్నారిపై అ త్యాచారానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్షప డేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత తె లిపారు. ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే ద్వా రంపూడి చంద్రశేఖరరెడ్డితో కలసి జీజీహెచ్‌లో గైనిక్‌వార్డులో చికిత్స పొందుతున్న బాధిత చి న్నారిని మంత్రి వనిత శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారిని ఓదార్చి, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చిన్నారిపై సైకోలా లైంగికదాడికి పాల్పడ్డాడని, ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదిలేదని, పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారని అన్నారు. 21రోజుల్లో దర్యాప్తు పూర్తయి శిక్ష పడేలా దిశ చట్టం ప్రవేశపెట్టారని, ఇది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని అన్నారు. ఈ ఘటన జరిగిన నాటినుంచి ఓ వ్యక్తి కనిపించడం లేదని, ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నార ని అన్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, మరింత మెరుగైన వైద్యం అందించాలని డా క్టర్లను ఆదేశించామని అన్నారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రూ.10లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ.లక్ష రూపాయలు అందిస్తామని, తక్షణ సాయం కింద రూ.25వేల చెక్కును తల్లిదండ్రులకు అందించామన్నారు. మంత్రి వెంట కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జేసీ కీర్తి చేకూరి, ఐసీ డీఎస్‌ పీడీ పుష్షమణి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:29:16+05:30 IST