ప్రజలతో మమేకమై పని చేయండి

ABN , First Publish Date - 2020-05-26T10:36:42+05:30 IST

‘గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రభుత్వానికి వారధి లాంటివారు. ప్రజలతో మమేకమై పని చేయా లి. అంతేతప్ప ప్రజలు నొచ్చుకునే విధంగా ..

ప్రజలతో మమేకమై పని చేయండి

ఏడాదిలో అన్నీ మంచి పనులే : మంత్రి వనిత


 ఏలూరు, మే 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రభుత్వానికి వారధి లాంటివారు. ప్రజలతో మమేకమై పని చేయా లి. అంతేతప్ప ప్రజలు నొచ్చుకునే విధంగా వ్యవహరించడం ఏమాత్రం మంచి ది కాదు. ఇలాంటి విషయాలు నాదృష్టికి వచ్చాయి. ఇక ముందు ఈతరహా ఫిర్యాదులు రాకుండా ప్రజలకు చేదోడువాదోడుగా ఉండాల్సిన బాధ్యత మీ మీదే’.. అంటూ రాష్ట్ర  స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. 


కలెక్టరేట్‌లో సోమవారం మన పాలన - మీ సూచన మేధోమధన  సదస్సును మంత్రి ప్రారంభించారు. గ్రామ రూపురేఖలే మార్చాలనేదే ముఖ్యమంత్రి ఆశయం అని దీనికి తగ్గట్టుగానే ఎన్ని ఆర్థిక సమస్యలున్నా సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎమ్మెల్సీ సూర్యారావు, జాయింట్‌ కలెక్టర్లు వెంకట రమణారెడ్డి, తేజ్‌భరత్‌, హిమాన్షుశుక్లా, ట్రైనీ కలెక్టర్‌ ఛాహట్‌ బాజ్‌పై పాల్గొన్నారు. 


గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన అత్యద్భుతంగా మంత్రి తానేటి వనిత అభివర్ణించారు. ఏలూరులో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.  ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలలో 90 శాతం హామీలను ఏడాది లోపలే పూర్తి చేశారన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు ఉన్నారు. 

Updated Date - 2020-05-26T10:36:42+05:30 IST