అప్పన్నను దర్శించుకున్న మంత్రి ఉషశ్రీ

ABN , First Publish Date - 2022-06-30T06:05:57+05:30 IST

రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి కె.వి.ఉషశ్రీచరణ్‌ బుధవారం సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.

అప్పన్నను దర్శించుకున్న మంత్రి ఉషశ్రీ
కప్ప స్తంభం వద్ద కుటుంబ సభ్యులతో మంత్రి ఉషశ్రీ

అధికార లాంఛనాలతో స్వాగతం పలికిన అధికారులు

సింహాచలం, జూన్‌ 29: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి కె.వి.ఉషశ్రీచరణ్‌ బుధవారం సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. దేవాలయ ఏఈఓ కె.తిరుమలేశ్వరరావు పూర్తి అఽధికార లాంఛనాలతో మంత్రికి ఆహ్వానం పలికారు.  కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండప ప్రదక్షిణ చేసిన అనంతరం మంత్రి గోత్ర నామాలతో అంతరాలయంలో ఇన్‌చార్జి ప్రధాన అర్చకులు ఐ.వి.రమణమూర్తి పూజలు చేశారు.   గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదస్వస్తి వచనాలతో ఆశీస్సులివ్వగా, ఏఈఓ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 


గిరి ప్రదక్షిణపై ఒకటిన అప్పన్న పాలకమండలి సమావేశం

వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక ఉత్సవాలలో భాగమైన ‘గిరి ప్రదక్షిణ’పై జూలై ఒకటిన సింహగిరిపై తన అధ్యక్షతన పాలక మండలి సమావేశం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు. సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల  దూరం నడిచి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకార్యర్థం చేపట్టవలసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే, 2న కలెక్టర్‌ అధ్యక్షతన ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఉంటుందని చెప్పారు. 

Updated Date - 2022-06-30T06:05:57+05:30 IST