కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-07-03T22:42:17+05:30 IST

నగరంలోని చారిత్రక బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని కన్నుల పండువగా, అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) వెల్లడించారు.

కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం: మంత్రి తలసాని

హైదరాబాద్: నగరంలోని చారిత్రక బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని కన్నుల పండువగా, అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) వెల్లడించారు. ఈనెల 5 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ(balkam peta yellamma) అమ్మవారి కళ్యాణం, 6వ తేదీన జరిగే రధోత్సవం ఏర్పాట్లను మంత్రి ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అమ్మవారి కల్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేలా LED స్క్రీన్ లను ఏర్పాటు చేయడంతో పాటు లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా ప్రజలు అమ్మవారి కళ్యాణాన్ని చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం CC కెమెరాల ఏర్పాటు, భారీ పోలీసు బందోబస్తు ఉంటుందని అన్నారు. అంతేకాకుండా షీ టీమ్స్, మఫ్టీ పోలీసు బృందాలు ఉంటాయని వివరించారు. అన్నదానం నిర్వహించే ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ కోసం GHMC ఆధ్వర్యంలో వ్యర్థాలు వేసేందుకు ప్రత్యేక కవర్ లు అందజేయనున్నట్లు చెప్పారు. 


కళ్యాణం నిర్వహించే అమ్మవారి నూతన విగ్రహాన్ని మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి సహకారంతో కుంభకోణం నుండి తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని, మహా పుణ్యక్షేత్రం ను తలపించే విధంగా మరింత అభివృద్ధి చేయనుంమట్లు తెలిపారు. గతంలో అమ్మవారి కళ్యాణాన్ని ఆలయం లోపల నిర్వహించే వారని, గత సంవత్సరం నుంచి ఆలయం ముందు నిర్మించిన భారీ రేకుల షెడ్డు క్రింద నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, EO అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2022-07-03T22:42:17+05:30 IST