మహంకాళి అమ్మవారికి పట్టు వస్ర్తాలు బహుకరించిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2020-07-10T20:15:32+05:30 IST

లష్కర్‌ బోనాలు ఆదివరం జరగనున్నాయి. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే అమ్మవారిని బోనాల జాతరకు ఈసారి కరోనా కారణంగా బ్రేక్‌పడింది.

మహంకాళి అమ్మవారికి పట్టు వస్ర్తాలు బహుకరించిన మంత్రి తలసాని

హైదరాబాద్‌: లష్కర్‌ బోనాలు ఆదివరం జరగనున్నాయి. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే అమ్మవారిని బోనాల జాతరకు ఈసారి కరోనా కారణంగా బ్రేక్‌పడింది. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈసారి అమ్మవారి ఆలయంలోనే అఽధికారులు, వేదపండితుల సమక్షంలోఅమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారిరి ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలను సమర్పించడం ఆనవాయితీ. ఈసారి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ శుక్రవారం తన నివాసంలో మహంకాళి అమ్మవారికి పట్టు వస్ర్తాలను అందజేశారు.


ఈసందర్భంగా ఆలయన ఈవో మనోహర్‌రెడ్డి, ఆలయ పండితులు మంత్రి తలసాని నుంచి పట్టు వస్ర్తాలను స్వీకరించారు. కరోనా వ్యాప్తికారణంగా ఈసారి లష్కర్‌బోనాలకు భక్తులనెవరినీ ఆలయంలోకి అనుమతించరు. భక్తులు ఎవరికివారు తమ ఇళ్లలోనే అమ్మవారికి బోనాలు సమర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు. 

Updated Date - 2020-07-10T20:15:32+05:30 IST