విజయ ఉత్పత్తులను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలి: తలసాని

ABN , First Publish Date - 2021-12-27T23:55:16+05:30 IST

విజయ పాలు,పాల ఉత్పత్తులను మరింత గా పెంచేందుకు ఐస్ క్రీం ఫుష్ కార్ట్ (ట్రై సైకిల్) లను రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం సబ్సిడీ పై అర్హులైన వారిని గుర్తించి అందించాలని, తద్వారా నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

విజయ ఉత్పత్తులను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలి: తలసాని

హైదరాబాద్: విజయ పాలు,పాల ఉత్పత్తులను మరింత గా పెంచేందుకు ఐస్ క్రీం ఫుష్ కార్ట్ (ట్రై సైకిల్) లను రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం సబ్సిడీ పై అర్హులైన వారిని గుర్తించి అందించాలని, తద్వారా నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీ ఫ్రీజర్ లను 50 శాతం సబ్సిడీ పై ఇవ్వడం ద్వారా డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలలో అభివృద్ధి కనిపిస్తుందని ఆయన తెలిపారు.   సోమవారం విజయ తెలంగాణ బోర్డు 14 వ సమావేశం చైర్మన్ లోక భూమారెడ్డి అద్యక్షతన జరిగింది. ఈ విజయ డెయిరీ ఎండీ అనిత రాజేంద్ర, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జీఎం కామేష్, మార్కెటింగ్ జీఎం మల్లికార్జున్ లు పాల్గొన్నారు. 


విజయ డెయిరీకి ఇప్పటికే పాలు పోసే రైతులను ప్రోత్సహించే విధంగా లీటర్ పాలకు 4 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తున్నదని, దీనికి అదనంగా పాడి రైతుల పిల్లలను విద్యలో ప్రోత్సహించే విధంగా విద్యాకానుక, ఆడబిడ్డ పెండ్లికి ఆర్ధిక సహాయం అందించే పెండ్లి కానుక క్రింద 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం, సబ్సిడీ పై దాణా సరఫరా, పాడి నిర్వహణ లో శిక్షణ కార్యక్రమాలు, ఉచిత పశువైద్య శిభిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాడి పశువు కొనుగోలుకు ఆర్ధిక సహాయం, నాణ్యత కలిగిన పాలు అందించిన మిల్క్ షెడ్ లకు అవార్డులు వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాలను పాల సేకరణ కేంద్రాల వద్ద, గ్రామపంచాయితీ కార్యాలయాలలో పోస్టర్ల ద్వారా, రైతు అవగాహన శిబిరాలలో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు.  


పాడి రైతులకు ప్రతి 7 రోజులకు ఒకసారి సకాలంలో పాల బిల్లును చెల్లించాలని సమావేశం తీర్మానించింది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల లో నూతన మెగా డెయిరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 5 లక్షల లీటర్ల పాల సామర్ధ్యం, 2.5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తుల తయారీ కలుపుకొని మొత్తం 7.5 లక్షల లీటర్ల సామర్ధ్యంతో నిర్మించనున్న మెగా డెయిరీ కి అవసరమైన పాల సేకరణ కు పూర్తిస్థాయి ప్రణాళికలను ఇప్పటి నుండే రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

Updated Date - 2021-12-27T23:55:16+05:30 IST