బోనాల జాతర నిర్వహణకు రూ.15 కోట్ల నిధుల కేటాయింపు: Talasani

ABN , First Publish Date - 2022-06-06T22:18:57+05:30 IST

తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల (bonalu festival) ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (srinivas yadav)వెల్లడించారు.

బోనాల జాతర నిర్వహణకు రూ.15 కోట్ల నిధుల కేటాయింపు: Talasani

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల (bonalu festival) ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (srinivas yadav)వెల్లడించారు.సోమవారం ఎంసిహెచ్ఆర్డి(mchrs)లో జాతర ఏర్పాట్లను అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో  ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా ప్రయివేట్ దేవాలయాలకు సుమారు 3 వేల దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. 


GHMC ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో LED స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 


భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి CC కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇంకా ఏమైనా ప్రభుత్వ పరమైన ఏర్పాట్లు అవసరమైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.

Updated Date - 2022-06-06T22:18:57+05:30 IST