అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదని కేసీఆర్ ఆవేదనతో మాట్లాడారు

ABN , First Publish Date - 2022-02-03T21:42:52+05:30 IST

ప్రధాని మోడీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, దేశం లో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తున్న దన్న పరిస్థితి ఉందని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదని కేసీఆర్ ఆవేదనతో మాట్లాడారు

హైదరాబాద్: ప్రధాని మోడీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, దేశం లో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తున్న దన్న పరిస్థితి ఉందని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాధ్, ముఠాగోపాల్ తో కలిసి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్ ఆవేదనతో మాట్లాడారు. దీనిని కొన్ని పార్టల వారు రాజకీయం చేస్తున్నారని అన్నారు.అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరమని కేసీఆర్ అన్నారు.


బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం మీద మాట్లాడకుండా కాంగ్రెస్, బీజేపీ లు కొత్త రాజ్యాంగ ప్రతిపాదన మీద మాట్లాడుతున్నారు.చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ బీజేపీ లు చేస్తున్నాయని ఆరోపించారు.మొరిగే కుక్కలుగా కొందరు మారిపోయారని మండి పడ్డారు. దమ్ముంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బడ్జెట్ లో తెలంగాణ కు ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో అమలవుతున్న పథకాలు ఎక్కడున్నాయో కిషన్ రెడ్డి చెప్పాలి.అంబెడ్కర్ ను అవమానించిన అరుణ్ శౌరి ని కేంద్ర మంత్రిగా చేసింది బీజేపీ కాదా?వాజ్ పేయి హాయంలో రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు కమిషన్ వేయలేదా? అని ప్రశ్నించారు.


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ గా ఒక్క లక్ష రూపాయలైనా తెచ్చారా? మూడేళ్లవుతుంది ఎంపీ గా గెలిచి...బీజేపీ కి పబ్లిసిటీ పిచ్చి పట్టింది...సోషల్ మీడియా, మీడియా లో కనిపించేందుకు ఇష్టమొచ్చినట్టు వాగుతున్నారని ఆయన విమర్శించారు.బీజేపీ నేతలు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి...ఎన్నికలపుడే బీజేపీ కి పథకాలు గుర్తొస్తాయి..ప్రజలకు కేంద్రం నుంచి ఏం తెచ్చారో బీజేపీ నేతలు చెప్పాలి...తెలంగాణ కు పథకాలు నిధులు ఎందుకు తీసుకు రారు...గాడ్సే వారసులు బీజేపీ నేతలు...మేము అంబెడ్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నాంమని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-03T21:42:52+05:30 IST