మేడారం జాతరకు హాజరైన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-02-18T19:55:07+05:30 IST

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మజాతరకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కుటుంబ సమేతంగా హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.

మేడారం జాతరకు హాజరైన మంత్రి తలసాని

హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మజాతరకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కుటుంబ సమేతంగా హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తులాభఆరం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.


ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మేడారం జాతర కుంభమేళాను తలపిస్తోందన్నారు. జాతరకు తరలి వచ్చే భక్తులతోరహదారులన్నీ కిక్కిరిసిపోయాయని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరిగాయని తెలిపారు.భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. 

Updated Date - 2022-02-18T19:55:07+05:30 IST