Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 14:40PM

కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి తలసాని

హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలోని నెక్లెస్ రోడ్ లో జరిగిన కైట్ ఫెస్టివల్ కు భారీ సంఖ్యలో యువతీ యువకులు కైట్స్ ఎగుర వేసేందుకు తరలి వచ్చారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ లో కైట్స్ ఎగుర వేసేందుకు వచ్చినయువతీ యువకులను ఉత్సామ పరుస్తూ మంత్రి తలసాని కూడా కైట్స్ ఎగుర వేశారు. తన చిన్నతనం నుంచి కైట్స్ ఎగురవేయడం అంటే ఎంతో ఇష్టమని మంత్రి తెలిపారు.


తెలంగాణ సంప్రదాయంలో భాగంగా సంక్రాంతిరోజుల్లో కైట్స్ ఎగుర వేయడం ఆనవాయితీగా వుందన్నారు. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ కైట్స్ ఎగుర వేయడానికి ఉత్సాహం చూపిస్తారని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యువతీ యువకులు ఫెస్టివల్ ను ఉత్సాహంగా జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement