శివరాజ్ సింగ్ కు కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదు

ABN , First Publish Date - 2022-01-08T20:09:46+05:30 IST

అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు

శివరాజ్ సింగ్ కు కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదు

హైదరాబాద్: అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ లో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొనడం హాస్యాస్పదంగా వుందన్నారు.నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా చేశానని చెప్పుకొనే శివరాజ్ సింగ్ చౌహాన్ కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని అన్నారు.


తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి ని సాధించిందని అన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు టూరిస్ట్ లుగా రావడం కాదు, కేంద్రం నుండి రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పే ధైర్యం ఉందా? అంటూ ఆయన ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలోనూ, బీజేపీ పాలిత రాష్ట్రాలలోఅభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అంటూ తలసాని సవాల్ విసిరారు.దేవుళ్ళను అడ్డం పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. 


నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ప్రాణాలను బలిగొన్నది బీజేపీ అన్నది వాస్తవం కాదా?ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిది కాదా? ఎందుకు కొనడం లేదని మంత్రి తలసాని ప్రశ్నించారు.ఉద్యోగుల సమస్యలపై పోరాడతాం అని బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు. ఏటా2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారో చెప్పే ధైర్యం నేతలకు వుందా? అంటూ ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-01-08T20:09:46+05:30 IST