ప్రతిపక్షాలకు పబ్లిసిటీ పిచ్చి బాగా ముదిరింది: తలసాని

ABN , First Publish Date - 2021-12-27T22:58:20+05:30 IST

రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పబ్లిసిటీ పిచ్చి బాగా పెరిగిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు

ప్రతిపక్షాలకు పబ్లిసిటీ పిచ్చి బాగా ముదిరింది: తలసాని

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పబ్లిసిటీ పిచ్చి బాగా పెరిగిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపీ పార్టీలు కేవలం సీఎం కేసీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. సోమవారం మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్ తో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గతంలో తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు ఉండేవి. కరెంటు సమస్య ఉండేది.అసెంబ్లీ సమావేశాల్లో ఇవే అంశాలు ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మచ్చుకైనా అలాంటి సీన్ లు కనిపించడం లేదన్నారు


ఏ రాష్ట్రం లో తెలంగాణ లాగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారో  ప్రతిపక్షాలు చెప్ప గలవా? నేను ఛాలెంజ్ చేస్తున్నా,సాగునీరు తాగు నీరు కు అల్లాడిన తెలంగాణ ను తన చతురత తో అగ్ర భాగాన నిలబెట్టింది కేసీఆర్ కాదా? రైతులకు ఇస్తున్న సదుపాయాల కారణంగా పంట దిగుబడులు భారీ గా పెరిగాయి.ఆహార భద్రత చట్టం ప్రకారం ధాన్యం సేకరణ కేంద్రం భాద్యత. అది మరిచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతాంగాన్ని అవమాన పరిచిన తీరు బాధాకరమని ఆయన అన్నారు.తెలంగాణ బీజేపీ నేతలకు పీయూష్  వాస్తవాలు చెప్పరా? వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.


యూపీ ఎన్నికల్లో ఒడిపోతామని తెలిసే సాగు చట్టాలు ఉపసంహరించుకున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ సాగు  చట్టాలు తెస్తామని మరో కేంద్ర మంత్రి చెబుతున్నారు.బీజేపీలో ఒక్కో నాయకుడి తీరు ఒక్కో రకంగా ఉంది.మరొకడు వరి ఖచ్చితంగా వేయాలని చెబుతుంటాడు.నిరుద్యోగ దీక్ష పేరిట బీజేపీ డ్రామా ఆడుతోందన్నారు. దమ్ముంటే కేంద్ర ఉద్యోగాల పై శ్వేత పత్రం ప్రకటించాలిమంత్రి తలసాని డిమాండ్ చేశారు. బీజేపీ మేనిఫెస్టో లో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది. ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ కు అవార్డులు ప్రకటిస్తున్న సంగతి బీజేపీ మూర్ఖులకు తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప ప్రతిపక్షాలకు ఏం చేతకాదని,నోరుంది కదా అని మాట్లాడితే ప్రజలు సరైన రీతిలో బుద్ది చెబుతారని హెచ్చరించారు.బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ కు పంజాబ్ లొనే దిక్కు లేదు.ఇక్కడొచ్చి ఏదో చేస్తానని మాట్లాడుతున్నారని అన్నారు.తెలంగాణ కు మేలు చేయడమే టీఆర్ఎస్ పని.బాధ్యతా యుత పదవి లో ఉండి రేవంత్ రెడ్డి అసభ్య పద జాలం వాడుతున్నారు.జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు గా ఉంటుంది బండి సంజయ్, రేవంత్ ల తీరు.తెలంగాణ కన్నా వేరే రాష్ట్రాల్లో పథకాలు బాగా అమలు జరుగుతున్నాయని కాంగ్రెస్ బీజేపీ లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి తలసాని సవాల్ విసిరారు. 

Updated Date - 2021-12-27T22:58:20+05:30 IST