Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేదలు సొంతింటిలో సంతోషంగా బతకాలన్నదే కేసీఆర్ ధ్యేయం

హైదరాబాద్: పేద ప్రజలు సైతం సొంత ఇంటిలో సంతోషంగా, గొప్పగా బ్రతకాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించే సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదు గర్వంగా జీవించాలన్న ధ్యేయంతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంబిగించారని తెలిపారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి పారదర్శత కోసమే ముందుగానే లబ్ధిదారుల ఎంపిక పేద  ప్రజలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తున్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం లో తప్ప  దేశంలో ఎక్కడా  లేదుని అన్నారు.

Advertisement
Advertisement