Abn logo
Oct 27 2021 @ 15:21PM

ప్రజల కోసం ఏం చేశారో బిజెపి నేతలకు చెప్పే దమ్ముందా?:తలసాని

హూజూరాబాద్: ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మేం చెప్తాం. కానీ బిజెపి ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు వుందా? అంటూపశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. బుధవారం హూజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్,  రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పే ధైర్యం మాకుందని, కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి నాయకులు ఏం చేశారో చెప్పాలని అన్నారు.గడిచిన 7 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే మీరు చేసిన అభివృద్ధా? అంటూ ప్రశ్నించారు. 


ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బిజెపి నేతలు ప్రభ్యత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.ఎంపి గా వ్యవహరిస్తున్న బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు.హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు గెలుపు ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ యే తమకు శ్రీ రామరక్ష అని అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్ నియోజక వర్గంలో బండి సంజయ్ కరోనా సమయంలో ఎప్పుడైనా పర్యటించావా?నోరు అదుపులో పెట్టుకో.... మేము మీకంటే ఎక్కువే తిట్టగలం....మాకు సంస్కారం ఉంది.ఈటెల రాజేందర్ చేశానని చెప్తున్న అభివృద్ధి మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేసినవేనని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...