ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోలన్నదే ప్రభుత్వ ఆలోచన

ABN , First Publish Date - 2021-09-18T20:12:35+05:30 IST

పండగలను ప్రజలు సంతోషంగా, శాంతి భద్రతల మధ్య జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోలన్నదే ప్రభుత్వ ఆలోచన

హైదరాబాద్: పండగలను ప్రజలు సంతోషంగా, శాంతి భద్రతల మధ్య జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీని కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. 


గణేష్ నిమజ్జనానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగి పోయాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.దీనికి కోసం చొరవ చూపిన ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతి యుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని సూచించారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు రాఘవ రెడ్డి, భగవంతరావు పాల్గొన్నారు. శోభాయాత్ర నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని వారికి వివరించారు. 

Updated Date - 2021-09-18T20:12:35+05:30 IST