మహంకాళీ అమ్మవారి ఆలయ ముఖద్వారాలు ప్రారంభించిన తలసాని

ABN , First Publish Date - 2022-07-15T20:34:58+05:30 IST

బోనాల జాతరకు సికింద్రాబాద్ ముస్తాబవుతోంది. అందులో భాగంగా మహంకాళీ అమ్మవారి దేవాలయమునకు వెళ్లే ముఖద్వారాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు.

మహంకాళీ అమ్మవారి ఆలయ ముఖద్వారాలు ప్రారంభించిన తలసాని

హైదరాబాద్: బోనాల జాతరకు సికింద్రాబాద్ ముస్తాబవుతోంది. అందులో భాగంగా మహంకాళీ అమ్మవారి దేవాలయమునకు వెళ్లే ముఖద్వారాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు.పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ బంగారు బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


ఈసందర్భంగా పోతరాజుల వీరంగాల మధ్య మంత్రి తలసాని కూడా వారితో కలిసి డాన్స్ చేయడం ఇక్కడికి తరలి వచ్చిన వారు సంతోషంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు MLA, MLC లు పాల్గొన్రనారు. మంత్రి తలసాని డ్యాన్స్లతో పోతరాజులు వీరంగాల మధ్య మహిళలు బోనాలతో, కోలాటాల మధ్య నృత్యాలు చేశారు.

Updated Date - 2022-07-15T20:34:58+05:30 IST