హైదరాబాద్: నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో వున్న బన్సీలాల్ పేట(bansilal pet)లోని పురాతన మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్ధానిక ఎమ్మెల్యే, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా చెత్తాచెదారంతో పూడుకు పోయిన ఈ బావిని కొంతకాలంగా పూడిక తీసే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రితలసాని మాట్లాడుతూ అమృత్సర్ లోని గురుద్వార మెట్ల బావి మాదిరిగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చి దిద్దుతామని చెప్పారు.
మున్సిపల్ శాఖ మంత్రి KTR ఆదేశాల మేరకు ఈపురాతన నిర్మాణాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.బావి పరిసరాలలోని అన్ని గృహాలకు నల్లా కనెక్షన్ లు, రహదారుల నిర్మాణం పర్యాటకులను ఆకర్షించే విధంగా బావి పరిసరాలలోని అన్ని భవనాలకు ఒకే రకమైన పెయింటింగ్ వేయించి ఆకర్షణీయంగా తీర్చిదిద్ధుతామని చెప్పారు. చారిత్రాత్మకమైన ఈ మెట్ల భావిని చూసేందుకు ఇప్పటికే ఎంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారని తెలిపారు. త్వరలో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఈ మెట్లబావి పునర్మిణం తర్వాత ఈ ప్రాంత రూపురేఖలే పూర్తిగా మారతాయని చెప్పారు. ఎంతో మంది ఉపాధి కల్పిందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి