ఆషాడ బోనాలను ఘనంగా నిర్వహిస్తాం:Talasani

ABN , First Publish Date - 2022-06-06T20:17:29+05:30 IST

గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆషాఢబోనాల జాతరను(aashada bonala jatara) ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) తెలిపారు.

ఆషాడ బోనాలను ఘనంగా నిర్వహిస్తాం:Talasani

హైదరాబాద్: గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆషాఢబోనాల జాతరను(aashada bonala jatara) ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం MCHRD లో బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి తలసానితో పాటు మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ప్రభుత్వ విప్ ప్రభాకర్, నగరానికి చెందిన MLA లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూఈ నెల 30 నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. 30 న గోల్కొండ బోనాలు జూలై 17 న సికింద్రాబాద్ బోనాలు, 24 న హైదరాబాద్ బోనాల ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక బోనాలు సంప్రదాయ బద్దంగా జరుగుతాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రికేసీఆర్ ప్రకటించారని తెలిపారు. 


ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని పండుగలను నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తుచేశారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకొనేలా ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తుందన్నారు.ప్రభుత్వం తరపున వివిధ ఆలయాలలో అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పిస్తుందన్నారు. 

Updated Date - 2022-06-06T20:17:29+05:30 IST