మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవం: Talasani

ABN , First Publish Date - 2022-05-27T20:05:19+05:30 IST

సికింద్రదాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి(ujjaini mahakali) అమ్మవారి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని మారుస్తారని వస్తున్న ప్రచారం అవాస్తవమని స్ధానిక శాసన సభ్యుడు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) స్పష్టం చేశారు

మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవం: Talasani

హైదరాబాద్: సికింద్రదాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి(ujjaini mahakali) అమ్మవారి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని మారుస్తారని వస్తున్న ప్రచారం అవాస్తవమని స్ధానిక శాసన సభ్యుడు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) స్పష్టం చేశారు. శుక్రవారం దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారని  కొందరు  చేస్తున్న ప్రచారం అభూత కల్పనలుగా అభివర్ణించారు.భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పై నిర్ణయాలు వుంటాయన్నారు.అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. 


తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు.అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి KCR ఆలోచనగా చెప్పారు.బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు.బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రయివేట్ ఆలయాలకు కూడా నిధులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాదిమంది తరలివస్తారు. వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సంవత్సరం కూడా బోనాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. 

Updated Date - 2022-05-27T20:05:19+05:30 IST