హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే యాదవుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన యాదవుల హక్కుల పోరాట సమితి(yadavula hakkula porata samithi) మహాసభ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయంగా, సామాజికంగా తెలంగాణ రాష్ట్రం లోనే యాదవులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాదవులకు 5 MLA లుగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు దక్కుతుందని అన్నారు.
అంతేకాకుండా సంక్షేమ భవనం కోసం కోకాపేట లో 250 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమి, భవనం నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల పిల్లల విద్య కోసం రాష్ట్రంలో 200 రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి ఉచితంగా విద్య, పుస్తకాలు, దుష్టులను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పిల్లలను ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పించి మంచి విద్యావంతులను చేయాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. యాదవులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి