హైదరాబాద్: పేద ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) చెప్పారు. పేదల కష్టాలను దూరం చేయాలని, మీరు సంతోషంగా ఉండాలనే విశాలమైన అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇండ్ల నిర్మాణం చేపట్టే ముందు కొంతమందికి అనుమానాలు ఉండేవని, అద్భుతమైన ఇండ్లను నిర్మించి అనుమానాలను పటా పంచలు చేసినట్లు తెలిపారు. ఈ బస్తీలో ఎంతో కాలం నుండి నివసిస్తున్న అర్హులైన వారిని బస్తీ ప్రజల సమక్షంలో బహిరంగంగా గుర్తించి వారందరికీ ఇండ్లను ఇస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఎవరో ఏదో చెబితే వారి మాటలు నమ్మి డబ్బులిచ్చి నష్టపోవద్దని ఆయన హెచ్చరించారు. కాలనీ ప్రజల కోసం ఒక బస్తీ దవాఖాన, ఒక అంగన్ వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి