పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం: తలసాని

ABN , First Publish Date - 2022-04-08T20:47:23+05:30 IST

పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం: తలసాని

హైదరాబాద్: పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రంగానికి ఎన్నో ప్రోత్సహకాలు ఇచ్చినట్టు తెలిపారు. శుక్రవారం హై టెక్స్ లో ఫుడ్ అండ్ డైరీ ఎగ్జిబిషన్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్్మ రంగాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడ పాల ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి అధికారులతో కమిటీని నియమించినట్టు చెప్పారు.


వ్యవసాయం తర్వాత అత్యధిక కుటుంబాలకు జీవనాధారం గా పాడి పరిశ్రమ రంగం ఉందన్నారు.ఎక్స్ పో లతో ఆధునిక టెక్నాలజీ, పాడి పరిశ్రమ అభివృద్ధి కి ఎంతో దోహద పడుతుందని.జీవాల ఆరోగ్య పరిరక్షణపై పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యాచరణ తో పని చేస్తుందని అన్నారు.జీవాల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్ళే విధంగా సంచార పశువైద్యశాలలు పని చేస్తున్నాయన్నారు. పాడి రైతులకు లీటర్ పాలకు 4 రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదని చెప్పారు.మూసివేత దశకు చేరుకున్న విజయ డెయిరీ 650 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. వెయ్యి కోట్ల టర్నోవర్ లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. 

Updated Date - 2022-04-08T20:47:23+05:30 IST