ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలకు ఎసరు: తలసాని

ABN , First Publish Date - 2021-03-04T20:42:33+05:30 IST

ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలకు కేంద్రంలోని బీజేపీప్రభుత్వం ఎసరు పెడుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు

ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలకు ఎసరు: తలసాని

హైదరాబాద్: ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలకు  కేంద్రంలోని బీజేపీప్రభుత్వం ఎసరు పెడుతున్నదని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. 6 సంవత్సరాలు ఎంఎల్సీ గా ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు గెలిపించిన పట్టభద్రుల కు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశఆరు. సనత్ నగర్ లోని శ్యామల కుంట పార్క్ లో, బికెగూడ సీనియర్ సిటీజన్స్ కార్యాలయంలో, బేగంపేట లోని ఎయిర్ లైన్స్ కాలనీ, అమీర్ పేటలో పట్టభద్రులను నేరుగా కలిసి ప్రచారం నిర్వహించారు.


ఎంఎల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని గెలిపించాలని కోరారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్ కూడా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు గా అమలు కాని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఒక లక్ష 32 వేల 899 ఉద్యోగాలను వివిధ ప్రభుత్వ శాఖలలో భర్తీ చేశామని అన్నారు. మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, పదోన్నతులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని తెలిపారు.


ఈసందర్భంగా కేండిడేట్ సురభి వాణీదేవి మా్టాడుతూ నాపై ఎంతో నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు  కృతజ్ఞతలు తెలిపారు. తనను గెలిపిస్తే మీ గొంతుకను అవుతానని అన్నారు. తనకు విద్యారంగంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది.అభివృద్ధి కొనసాగేందుకు టీఆర్ఎస్ను బలపర్చండని కోరారు.కాగా  సురభి వాణిదేవి గెలుపే  పీవీ నర్సింహారావుకు  నిజమైన నివాళులు అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పీవీ నర్సింహారావు దేశ ప్రధాని గా తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణల కారణంగా దేశం అభివృద్ధి లో పయనిస్తోందని తెలిపారు. 

Updated Date - 2021-03-04T20:42:33+05:30 IST